Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #46 Translated in Telugu

إِذْ أَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنْكُمْ ۚ وَلَوْ تَوَاعَدْتُمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَٰكِنْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِيَهْلِكَ مَنْ هَلَكَ عَنْ بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَنْ بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ
(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు. మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తి చేయటానికి, నశించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَٰكِنَّ اللَّهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకు చూపి ఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుద్ధ) విషయంలో వాదులాడే వారు. కాని వాస్తవానికి, అల్లాహ్ మిమ్మల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు
وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) అల్లాహ్ నెరవేర్చవలసిన పనిని నెరవేర్చటానికి - మీరు (బద్ర్ యుద్ధరంగంలో) మార్కొనినపుడు - వారి (అవిశ్వాసుల) సైన్యాన్ని మీ కన్నులకు కొద్దిగా చూపాడు మరియు మిమ్మల్ని కొద్దిమందిగా వారికి చూపాడు. మరియు అన్ని వ్యవహారాలూ (నిర్ణయానికి) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వాసులారా! మీరు ఏ సైన్యాన్నైనా ఎదుర్కొనేటప్పుడు, స్థైర్యంతో ఉండండి. మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తే, మీరు సాఫల్యం పొందవచ్చు
وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు పరస్పర కలహాలకు గురి కాకండి, అట్లు చేస్తే మీరు బలహీనులవుతారు మరియు మీ బలసాహసాలు తగ్గిపోతాయి. మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు

Choose other languages: