Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #79 Translated in Telugu

وَكَذَٰلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ
మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్ కు భూమ్యాకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము
فَلَمَّا جَنَّ عَلَيْهِ اللَّيْلُ رَأَىٰ كَوْكَبًا ۖ قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَا أُحِبُّ الْآفِلِينَ
ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: అస్తమించే వాటిని నేను ప్రేమించను!" అని అన్నాడు
فَلَمَّا رَأَى الْقَمَرَ بَازِغًا قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَئِنْ لَمْ يَهْدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ الْقَوْمِ الضَّالِّينَ
ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని అది అస్తమించగానే, ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా, మార్గభ్రష్టులైన వారిలో చేరి పోయేవాడను!"అని అన్నాడు
فَلَمَّا رَأَى الشَّمْسَ بَازِغَةً قَالَ هَٰذَا رَبِّي هَٰذَا أَكْبَرُ ۖ فَلَمَّا أَفَلَتْ قَالَ يَا قَوْمِ إِنِّي بَرِيءٌ مِمَّا تُشْرِكُونَ
ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి: ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది!" అని అన్నాడు. కాని అది కూడా అస్తమించగానే: ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వామ్యము) కల్పించే దానితో వాస్తవంగా నాకెలాంటి సంబంధం లేదు!" అని అన్నాడు
إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఇంకా ఇలా అన్నాడు): నిశ్చయంగా, నేను ఏక దైవసిద్ధాంతం (సత్యధర్మం) పాటించే వాడనై, నా ముఖాన్ని భుమ్యాకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన (అల్లాహ్) వైపునకే త్రిప్పు కుంటున్నాను. మరియు నేను అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిన వాడను కాను

Choose other languages: