Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #53 Translated in Telugu

وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ
కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి, తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది
قُلْ لَا أَقُولُ لَكُمْ عِنْدِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను. వారిని ఇలా అడుగు: ఏమీ? అంధుడూ మరియు దృష్టి గలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు
وَأَنْذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَنْ يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُمْ مِنْ دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَعَلَّهُمْ يَتَّقُونَ
మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశ పరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గానీ, సిఫారసు చేసే వాడు గానీ ఉండడని, దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హెచ్చరించు, బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో
وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُمْ بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِمْ مِنْ شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ
మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు
وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِيَقُولُوا أَهَٰؤُلَاءِ مَنَّ اللَّهُ عَلَيْهِمْ مِنْ بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ
మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు (విశ్వాసులను చూసి): ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్ అనుగ్రహించింది?" అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్ కు తెలియదా

Choose other languages: