Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #45 Translated in Telugu

بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِنْ شَاءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُونَ
అలా కానేరదు! మీరు ఆయన (అల్లాహ్) నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీ పై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు
وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِنْ قَبْلِكَ فَأَخَذْنَاهُمْ بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ముహమ్మద్!) అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగ జేశాము
فَلَوْلَا إِذْ جَاءَهُمْ بَأْسُنَا تَضَرَّعُوا وَلَٰكِنْ قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ
పిదప మా తరఫు నుండి వారిపై ఆపద వచ్చినపుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు షైతాన్ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు
فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُمْ بَغْتَةً فَإِذَا هُمْ مُبْلِسُونَ
ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారి కొరకు సకల (భోగభాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని ఆకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టు కున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఈ విధంగా దుర్మార్గానికి పాల్పబడిన వారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు

Choose other languages: