Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #47 Translated in Telugu

فَلَوْلَا إِذْ جَاءَهُمْ بَأْسُنَا تَضَرَّعُوا وَلَٰكِنْ قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ
పిదప మా తరఫు నుండి వారిపై ఆపద వచ్చినపుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు షైతాన్ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు
فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُمْ بَغْتَةً فَإِذَا هُمْ مُبْلِسُونَ
ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారి కొరకు సకల (భోగభాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని ఆకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టు కున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఈ విధంగా దుర్మార్గానికి పాల్పబడిన వారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُمْ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُمْ بِهِ ۗ انْظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ
ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ మీ వినికిడినీ మరియు మీ చూపునూ పోగొట్టి, మీ హృదయాలపై ముద్ర వేస్తే! అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు! మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో! అయినా వారు (వాటి నుండి) తప్పించుకొని పోతున్నారు
قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ
ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ శిక్ష మీపై (రాత్రివేళ) ఆకస్మాత్తుగా గానీ లేక (పగటివేళ) బహిరంగంగా గాని వచ్చి పడితే, దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా

Choose other languages: