Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #42 Translated in Telugu

وَمَا مِنْ دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُمْ ۚ مَا فَرَّطْنَا فِي الْكِتَابِ مِنْ شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ
మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షి గానీ, మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు! మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు. తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింపబడతారు
وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا صُمٌّ وَبُكْمٌ فِي الظُّلُمَاتِ ۗ مَنْ يَشَإِ اللَّهُ يُضْلِلْهُ وَمَنْ يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారు, చెవిటివారు మరియు మూగవారు, అంధకారంలో పడిపోయిన వారు! అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు మరియు తాను కోరిన వారిని ఋజుమార్గంలో ఉంచుతాడు
قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَغَيْرَ اللَّهِ تَدْعُونَ إِنْ كُنْتُمْ صَادِقِينَ
వారితో అను: ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినా, లేదా అంతిమ ఘడియ వచ్చినా! మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా
بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِنْ شَاءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُونَ
అలా కానేరదు! మీరు ఆయన (అల్లాహ్) నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీ పై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు
وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِنْ قَبْلِكَ فَأَخَذْنَاهُمْ بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ముహమ్మద్!) అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగ జేశాము

Choose other languages: