Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #20 Translated in Telugu

مَنْ يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْمُبِينُ
ఆ రోజు దాని (ఆ శిక్ష నుండి) తప్పించుకున్న వాడిని, వాస్తవంగా! ఆయన (అల్లాహ్) కరుణించినట్లే. మరియు అదే స్పష్టమైన విజయం (సాఫల్యం)
وَإِنْ يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِنْ يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు
قُلْ أَيُّ شَيْءٍ أَكْبَرُ شَهَادَةً ۖ قُلِ اللَّهُ ۖ شَهِيدٌ بَيْنِي وَبَيْنَكُمْ ۚ وَأُوحِيَ إِلَيَّ هَٰذَا الْقُرْآنُ لِأُنْذِرَكُمْ بِهِ وَمَنْ بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ اللَّهِ آلِهَةً أُخْرَىٰ ۚ قُلْ لَا أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَإِنَّنِي بَرِيءٌ مِمَّا تُشْرِكُونَ
(ఓ ముహమ్మద్! వారిని) అడుగు: అన్నింటి కంటే గొప్ప సాక్ష్యం ఏదీ?" ఇలా అను: నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్ఆన్ నాపై అవతరింపజ జేయబడింది." ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తో పాటు ఇంకా ఇతర ఆరాధ్యదైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా, సాక్ష్యమివ్వగలరా? ఇలా అను: నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను!" ఇంకా ఇలా అను: నిశ్చయంగా ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్య దేవుడు. మరియు నిశ్చయంగా, మీరు ఆయనకు సాటి కల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు
الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ముహమ్మద్ ను) కూడా గుర్తిస్తారు. ఎవరైతే, తమను తాము నష్టానికి గురి చేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు

Choose other languages: