Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #109 Translated in Telugu

وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِنْ بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ
స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది
يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ
ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: మీరు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి." (అని అనబడుతుంది)
وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ
ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లాహ్ కారుణ్యంలో (స్వర్గంలో) ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِلْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ సూక్తులు (ఆయాత్) మేము వాటిని యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు
وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి

Choose other languages: