Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #51 Translated in Telugu

وَلِكُلِّ أُمَّةٍ رَسُولٌ ۖ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُمْ بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ
మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంపబడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో, అప్పుడు వారి మధ్య (వ్యవహారాల) తీర్పు న్యాయంగా చేయబడుతుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صَادِقِينَ
మరియు వారిలా అడుగుతున్నారు: మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది
قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۚ إِذَا جَاءَ أَجَلُهُمْ فَلَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకు లేదు. ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనక గానీ లేక ముందు గానీ కాలేరు
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَتَاكُمْ عَذَابُهُ بَيَاتًا أَوْ نَهَارًا مَاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُونَ
వారితో అను: ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక పగలు గానీ వచ్చి పడితే (మీరేం చేయగలరు)? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు
أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنْتُمْ بِهِ ۚ آلْآنَ وَقَدْ كُنْتُمْ بِهِ تَسْتَعْجِلُونَ
ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపడ్తూ ఉండేవారు కదా

Choose other languages: