Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #42 Translated in Telugu

أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِسُورَةٍ مِثْلِهِ وَادْعُوا مَنِ اسْتَطَعْتُمْ مِنْ دُونِ اللَّهِ إِنْ كُنْتُمْ صَادِقِينَ
అయినా వారు: అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ ను విడిచి మీరు పిలువ గలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని - దీని వంటి ఒక్క సూరహ్ నైనా (రచించి) తీసుకురండి
بَلْ كَذَّبُوا بِمَا لَمْ يُحِيطُوا بِعِلْمِهِ وَلَمَّا يَأْتِهِمْ تَأْوِيلُهُ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۖ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ
కాని వారు - దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాన వ్యాఖ్యానం వారి వద్దకు రాకముందే - దానిని అబద్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబద్ధమని తిరస్కరించారు. కావున, చూశారా! ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో
وَمِنْهُمْ مَنْ يُؤْمِنُ بِهِ وَمِنْهُمْ مَنْ لَا يُؤْمِنُ بِهِ ۚ وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ
మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు
وَإِنْ كَذَّبُوكَ فَقُلْ لِي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ ۖ أَنْتُمْ بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِمَّا تَعْمَلُونَ
మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను
وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنْتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ
మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటి వారికి వినిపించ గలవా? మరియు వారు ఏమీ అర్థం చేసు కోలేక పోయినప్పటికీ (వారికి వినిపించగలవా)

Choose other languages: