Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #43 Translated in Telugu

بَلْ كَذَّبُوا بِمَا لَمْ يُحِيطُوا بِعِلْمِهِ وَلَمَّا يَأْتِهِمْ تَأْوِيلُهُ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۖ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ
కాని వారు - దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాన వ్యాఖ్యానం వారి వద్దకు రాకముందే - దానిని అబద్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబద్ధమని తిరస్కరించారు. కావున, చూశారా! ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో
وَمِنْهُمْ مَنْ يُؤْمِنُ بِهِ وَمِنْهُمْ مَنْ لَا يُؤْمِنُ بِهِ ۚ وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ
మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు
وَإِنْ كَذَّبُوكَ فَقُلْ لِي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ ۖ أَنْتُمْ بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِمَّا تَعْمَلُونَ
మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను
وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنْتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ
మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటి వారికి వినిపించ గలవా? మరియు వారు ఏమీ అర్థం చేసు కోలేక పోయినప్పటికీ (వారికి వినిపించగలవా)
وَمِنْهُمْ مَنْ يَنْظُرُ إِلَيْكَ ۚ أَفَأَنْتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ
మరియు వారిలో కొందరు నీ వైపునకు చూస్తూ ఉంటారు. ఏమీ? నీవు గ్రుడ్రివారికి సరైన మార్గం చూపించగలవా? మరియు వారికి ఏమీ కనిపించనప్పటికి కూడానా

Choose other languages: