Quran Apps in many lanuages:

Surah Ta-Ha Ayahs #84 Translated in Telugu

يَا بَنِي إِسْرَائِيلَ قَدْ أَنْجَيْنَاكُمْ مِنْ عَدُوِّكُمْ وَوَاعَدْنَاكُمْ جَانِبَ الطُّورِ الْأَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము
كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَلَا تَطْغَوْا فِيهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِي ۖ وَمَنْ يَحْلِلْ عَلَيْهِ غَضَبِي فَقَدْ هَوَىٰ
(ఇంకా ఇలా అన్నాము): మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి, అందు తలబిరుసుతనం చేయకండి, అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు
وَإِنِّي لَغَفَّارٌ لِمَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدَىٰ
అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను
وَمَا أَعْجَلَكَ عَنْ قَوْمِكَ يَا مُوسَىٰ
మరియు (మూసా తూర్ పర్వతం మీద ఉన్నప్పుడు అల్లాహ్ అన్నాడు): ఓ మూసా! నీవు నీ జాతి వారిని విడిచి శీఘ్రంగా (ఇక్కడికి) వచ్చిన కారణమేమిటి
قَالَ هُمْ أُولَاءِ عَلَىٰ أَثَرِي وَعَجِلْتُ إِلَيْكَ رَبِّ لِتَرْضَىٰ
(మూసా) జవాబిచ్చాడు: అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను

Choose other languages: