Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #49 Translated in Telugu

وَكَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా) తిరస్కరించారు. మేము (పూర్వం) వారికిచ్చిన దానిలో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా! నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో
قُلْ إِنَّمَا أَعِظُكُمْ بِوَاحِدَةٍ ۖ أَنْ تَقُومُوا لِلَّهِ مَثْنَىٰ وَفُرَادَىٰ ثُمَّ تَتَفَكَّرُوا ۚ مَا بِصَاحِبِكُمْ مِنْ جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: `మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!` మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే, దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే
قُلْ مَا سَأَلْتُكُمْ مِنْ أَجْرٍ فَهُوَ لَكُمْ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
ఇలా అను: నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి, నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది. మరియు ఆయనే ప్రతి దానికి సాక్షి
قُلْ إِنَّ رَبِّي يَقْذِفُ بِالْحَقِّ عَلَّامُ الْغُيُوبِ
ఇలా అను: నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు
قُلْ جَاءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيدُ
ఇలా అను: సత్యం వచ్చేసింది! మరియు అసత్యం (మిథ్యం దేనినీ ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు)

Choose other languages: