Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #14 Translated in Telugu

أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا
ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది
ذَٰلِكَ بِأَنَّ اللَّهَ مَوْلَى الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَىٰ لَهُمْ
ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు
إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَهُمْ
నిశ్చయంగా, అల్లాహ్! విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగభాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్న వారి నివాసం నరకాగ్నియే అవుతుంది
وَكَأَيِّنْ مِنْ قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِنْ قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ
మరియు (ఓ ముహమ్మద్!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము. వారికి సహాయపడే వాడెవ్వడూ లేకపోయాడు
أَفَمَنْ كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّهِ كَمَنْ زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
ఏమీ? తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన మార్గం మీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా

Choose other languages: