Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #17 Translated in Telugu

وَكَأَيِّنْ مِنْ قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِنْ قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ
మరియు (ఓ ముహమ్మద్!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము. వారికి సహాయపడే వాడెవ్వడూ లేకపోయాడు
أَفَمَنْ كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّهِ كَمَنْ زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
ఏమీ? తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన మార్గం మీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా
مَثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِنْ مَاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِنْ لَبَنٍ لَمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِنْ خَمْرٍ لَذَّةٍ لِلشَّارِبِينَ وَأَنْهَارٌ مِنْ عَسَلٍ مُصَفًّى ۖ وَلَهُمْ فِيهَا مِنْ كُلِّ الثَّمَرَاتِ وَمَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ ۖ كَمَنْ هُوَ خَالِدٌ فِي النَّارِ وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ
భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుద్ధమైన తేనె కాలువలు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో అన్ని రకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. ఇలాంటి వాడు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి సలసల కాగే నీటిని త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో - సమానుడు కాగలడా
وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُ إِلَيْكَ حَتَّىٰ إِذَا خَرَجُوا مِنْ عِنْدِكَ قَالُوا لِلَّذِينَ أُوتُوا الْعِلْمَ مَاذَا قَالَ آنِفًا ۚ أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
మరియు (ఓ ముహమ్మద్!) వారిలో (కపట విశ్వాసులలో) నీ మాటలను చెవి యొగ్గి వినేవారు కొందరున్నారు. కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: అతను చెప్పినదేమిటి?" వీరే! అల్లాహ్ హృదయాల మీద ముద్రివేసిన వారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు
وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ
మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన (అల్లాహ్) ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు మరియు వారి దైవభీతిని వృద్ధి చేస్తాడు

Choose other languages: