Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #62 Translated in Telugu

وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَلَا الْمُسِيءُ ۚ قَلِيلًا مَا تَتَذَكَّرُونَ
మరియు గ్రుడ్డివాడు మరియు చూడగలవాడు సరిసమానులు కాజాలరు మరియు అదే విధంగా! విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా (సమానులు కాజాలరు). మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ
إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لَا رَيْبَ فِيهَا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది ప్రజలు విశ్వసించరు
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు
اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
అల్లాహ్! ఆయనే, మీ కొరకు విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మరియు (చూడటానికి) ప్రకాశవంతమైన పగటిని నియమించినవాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల ఎంతో అనుగ్రహుడు, కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు తెలుపరు
ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَيْءٍ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)

Choose other languages: