Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #37 Translated in Telugu

يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُمْ مِنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۗ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
ఆరోజు మీరు వెనుదిరిగి పారిపోవాలనుకుంటారు, కాని అల్లాహ్ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు
وَلَقَدْ جَاءَكُمْ يُوسُفُ مِنْ قَبْلُ بِالْبَيِّنَاتِ فَمَا زِلْتُمْ فِي شَكٍّ مِمَّا جَاءَكُمْ بِهِ ۖ حَتَّىٰ إِذَا هَلَكَ قُلْتُمْ لَنْ يَبْعَثَ اللَّهُ مِنْ بَعْدِهِ رَسُولًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ هُوَ مُسْرِفٌ مُرْتَابٌ
మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొని వచ్చాడు. కాని మీరు అతడు తెచ్చిన వాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరన్నారు: ఇక అల్లాహ్ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!" ఈ విధంగా అల్లాహ్ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు
الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۖ كَبُرَ مَقْتًا عِنْدَ اللَّهِ وَعِنْدَ الَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ
ఎవరైతే అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతి వ్యక్తి హృదయం మీద ముద్ర వేస్తాడు
وَقَالَ فِرْعَوْنُ يَا هَامَانُ ابْنِ لِي صَرْحًا لَعَلِّي أَبْلُغُ الْأَسْبَابَ
మరియు ఫిరఔన్ ఇలా అన్నాడు: ఓ హామాన్! నా కొరకు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించు, బహుశా (దాని పైకి ఎక్కి) నేను మార్గాలను పొందవచ్చు
أَسْبَابَ السَّمَاوَاتِ فَأَطَّلِعَ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ كَاذِبًا ۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوءُ عَمَلِهِ وَصُدَّ عَنِ السَّبِيلِ ۚ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِي تَبَابٍ
ఆకాశాలలోనికి వెళ్ళే మార్గాలు! మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి. ఎందుకంటే, నిశ్చయంగా, నేను అతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను!" మరియు ఈ విధంగా ఫిరఔన్ కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి. మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు. మరియు ఫిరఔన్ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది

Choose other languages: