Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #26 Translated in Telugu

وَمَا كُنْتُمْ تَسْتَتِرُونَ أَنْ يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِنْ ظَنَنْتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِمَّا تَعْمَلُونَ
మరియు (మీరు దుష్కార్యాలు చేసేటప్పుడు) మీ చెవుల నుండి మీ కండ్ల నుండి మరియు మీ చర్మాల నుండి - మీకు వ్యతిరేకంగా సాక్ష్యం వస్తుందేమోనని - మిమ్మల్ని మీరు దాచుకునేవారు కాదు. అంతేకాదు మీరు చేస్తున్న ఎన్నో కార్యాలు వాస్తవంగా, అల్లాహ్ కు తెలియటం లేదని మీరు భావించేవారు
وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنْتُمْ بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُمْ مِنَ الْخَاسِرِينَ
మరియు మీ ప్రభువు పట్ల మీరు భావించిన ఈ భావనే మిమ్మల్ని నాశనం చేసింది. కావున మీరు నష్టపోయే వారిలో చేరిపోయారు
فَإِنْ يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَهُمْ ۖ وَإِنْ يَسْتَعْتِبُوا فَمَا هُمْ مِنَ الْمُعْتَبِينَ
అప్పుడు వారు సహనం చూపినా, నరకాగ్నియే వారి నివాస స్థానమవుతుంది. ఒకవేళ వారు (తమను తాము సరిదిద్దుకోవటానికి) అవకాశం కొరకు వేడుకున్నా వారికి అవకాశం ఇవ్వబడదు
وَقَيَّضْنَا لَهُمْ قُرَنَاءَ فَزَيَّنُوا لَهُمْ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
మరియు మేము వీరికి స్నేహితులుగా (షైతానులను) నియమించాము. వారు వీరి ముందూ వెనుకా ఉన్న వాటిని వీరికి ఆకర్షణీయమైన వాటిగా చేశారు. కావున వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల తరాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే, వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా, వీరే నష్టానికి గురి అయిన వారయ్యారు
وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَسْمَعُوا لِهَٰذَا الْقُرْآنِ وَالْغَوْا فِيهِ لَعَلَّكُمْ تَغْلِبُونَ
మరియు సత్యతిరస్కారులు (పరస్పరం) ఇలా చెప్పుకుంటారు: ఈ ఖుర్ఆన్ ను వినకండి! మరియు ఇది వినిపించబడినప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి, బహుశా మీరు ప్రాబల్యం పొంద వచ్చు

Choose other languages: