Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #45 Translated in Telugu

إِنَّ اللَّهَ يُمْسِكُ السَّمَاوَاتِ وَالْأَرْضَ أَنْ تَزُولَا ۚ وَلَئِنْ زَالَتَا إِنْ أَمْسَكَهُمَا مِنْ أَحَدٍ مِنْ بَعْدِهِ ۚ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడి పోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే, ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా? నిశ్చయంగా, ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు
وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ جَاءَهُمْ نَذِيرٌ لَيَكُونُنَّ أَهْدَىٰ مِنْ إِحْدَى الْأُمَمِ ۖ فَلَمَّا جَاءَهُمْ نَذِيرٌ مَا زَادَهُمْ إِلَّا نُفُورًا
మరియు, ఒకవేళ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వస్తే! వారు తప్పక, ఇతర సమాజాల వారి కంటే ఎక్కువగా సన్మార్గం మీద ఉండేవారని అల్లాహ్ సాక్షిగా గట్టి ప్రమాణాలు చేస్తారు. కాని హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వచ్చినపుడు మాత్రం (అతని రాక) వారి వ్యతిరేకతను తప్ప మరేమీ అధికం చేయలేక పోయింది
اسْتِكْبَارًا فِي الْأَرْضِ وَمَكْرَ السَّيِّئِ ۚ وَلَا يَحِيقُ الْمَكْرُ السَّيِّئُ إِلَّا بِأَهْلِهِ ۚ فَهَلْ يَنْظُرُونَ إِلَّا سُنَّتَ الْأَوَّلِينَ ۚ فَلَنْ تَجِدَ لِسُنَّتِ اللَّهِ تَبْدِيلًا ۖ وَلَنْ تَجِدَ لِسُنَّتِ اللَّهِ تَحْوِيلًا
(ఇది) వారు భూమిలో మరింత దురహంకారంతో తిరుగుతూ, దుష్ట పన్నాగాలు పన్నినందుకు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు, వాటిని పన్నే వారికే హాని కలిగిస్తాయి. తమ పూర్వీకుల పట్ల అవలంబించ బడిన విధానమే (వారి పట్ల కూడా) అవలంబించ బడాలని వారు నిరీక్షిస్తున్నారా ఏమిటి? కాని నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి అతిక్రమాన్ని చూడలేవు
أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ وَكَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً ۚ وَمَا كَانَ اللَّهُ لِيُعْجِزَهُ مِنْ شَيْءٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ إِنَّهُ كَانَ عَلِيمًا قَدِيرًا
వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా ఏమిటి? వారికి పూర్వం గతించిన వారు వీరి కంటే అత్యంత బలవంతులైనా, వారి పరిణామం ఏమయిందో వారు చూడలేదా? అల్లాహ్ నుండి తప్పించుకో గలిగేది ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ ఏదీ లేదు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు
وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِمَا كَسَبُوا مَا تَرَكَ عَلَىٰ ظَهْرِهَا مِنْ دَابَّةٍ وَلَٰكِنْ يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ فَإِنَّ اللَّهَ كَانَ بِعِبَادِهِ بَصِيرًا
ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసిన కర్మలకు గానూ పట్టుకోదలిస్తే! (భూమి) మీద ఏ ఒక్క ప్రాణిని కూడా ఆయన వదిలి పెట్టి ఉండేవాడు కాదు! నిజానికి ఆయన వారికి ఒక నియమిత సమయం వరకు గడువునిస్తున్నాడు. కాని వారి గడువు పూర్తయితే; అప్పుడు నిశ్చయంగా, అల్లాహ్ సదా తన దాసులను స్వయంగా చూసుకుంటాడు

Choose other languages: