Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #91 Translated in Telugu

رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ
వారు, వెనుక ఉండిపోయే వారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయబడి వుంది, కావున వారు అర్థం చేసుకోలేరు
لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు
أَعَدَّ اللَّهُ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం
وَجَاءَ الْمُعَذِّرُونَ مِنَ الْأَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِينَ كَذَبُوا اللَّهَ وَرَسُولَهُ ۚ سَيُصِيبُ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు
لَيْسَ عَلَى الضُّعَفَاءِ وَلَا عَلَى الْمَرْضَىٰ وَلَا عَلَى الَّذِينَ لَا يَجِدُونَ مَا يُنْفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا لِلَّهِ وَرَسُولِهِ ۚ مَا عَلَى الْمُحْسِنِينَ مِنْ سَبِيلٍ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: