Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #93 Translated in Telugu

أَعَدَّ اللَّهُ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం
وَجَاءَ الْمُعَذِّرُونَ مِنَ الْأَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِينَ كَذَبُوا اللَّهَ وَرَسُولَهُ ۚ سَيُصِيبُ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు
لَيْسَ عَلَى الضُّعَفَاءِ وَلَا عَلَى الْمَرْضَىٰ وَلَا عَلَى الَّذِينَ لَا يَجِدُونَ مَا يُنْفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا لِلَّهِ وَرَسُولِهِ ۚ مَا عَلَى الْمُحْسِنِينَ مِنْ سَبِيلٍ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
وَلَا عَلَى الَّذِينَ إِذَا مَا أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَا أَجِدُ مَا أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوْا وَأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا مَا يُنْفِقُونَ
మరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు." అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు
إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ
కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు

Choose other languages: