Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #22 Translated in Telugu

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَنْ يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు
أَجَعَلْتُمْ سِقَايَةَ الْحَاجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَجَاهَدَ فِي سَبِيلِ اللَّهِ ۚ لَا يَسْتَوُونَ عِنْدَ اللَّهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు
الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِنْدَ اللَّهِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ
విశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు
يُبَشِّرُهُمْ رَبُّهُمْ بِرَحْمَةٍ مِنْهُ وَرِضْوَانٍ وَجَنَّاتٍ لَهُمْ فِيهَا نَعِيمٌ مُقِيمٌ
వారి ప్రభువు వారికి, తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలు గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు
خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّهَ عِنْدَهُ أَجْرٌ عَظِيمٌ
వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది

Choose other languages: