Quran Apps in many lanuages:

Surah At-Talaq Ayahs #4 Translated in Telugu

يَا أَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا الْعِدَّةَ ۖ وَاتَّقُوا اللَّهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِنْ بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّا أَنْ يَأْتِينَ بِفَاحِشَةٍ مُبَيِّنَةٍ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَنْ يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ لَا تَدْرِي لَعَلَّ اللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا
ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. మరియు మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడల గొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళి పోకూడదు. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు
فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِنْكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مَخْرَجًا
ఇక వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు, వారిని ధర్మప్రకారంగా (వివాహబంధంలో) ఉంచుకోండి, లేదా ధర్మప్రకారంగా వారిని విడచి పెట్టండి. మరియు మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. మరియు అల్లాహ్ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు, ఈ విధమైన ఉపదేశమివ్వబడుతోంది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు గలవానికి, ఆయన ముక్తిమార్గం చూపుతాడు
وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا
మరియు ఆయన, అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీనవోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్ తన పని పూర్తి చేసి తీరుతాడు. వాస్తవానికి, అల్లాహ్ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్) నిర్ణయించి ఉన్నాడు
وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِنْ نِسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَنْ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مِنْ أَمْرِهِ يُسْرًا
మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచి పోయినవారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతుస్రావం ఇంకా ప్రారంభం కాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు. మరియు గర్భవతులైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన, అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు

Choose other languages: