Quran Apps in many lanuages:

Surah Ash-Shura Ayahs #52 Translated in Telugu

فَإِنْ أَعْرَضُوا فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ إِنْ عَلَيْكَ إِلَّا الْبَلَاغُ ۗ وَإِنَّا إِذَا أَذَقْنَا الْإِنْسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۖ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ الْإِنْسَانَ كَفُورٌ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు విముఖులైతే మేము నిన్ను వారిపై రక్షకునిగా చేసి పంపలేదు. నీ పని కేవలం (సందేశాన్ని) అందజేయటం మాత్రమే. మరియు మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే, దానికి అతడు సంతోషంతో పొంగిపోతాడు. కాని ఒకవేళ వారికి తమ చేతులారా చేసుకున్న దానికి ఫలితంగా, కీడు కలిగినట్లయితే! నిశ్చయంగా, అప్పుడు మానవుడు కృతఘ్ను డవుతాడు
لِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ يَهَبُ لِمَنْ يَشَاءُ إِنَاثًا وَيَهَبُ لِمَنْ يَشَاءُ الذُّكُورَ
భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే! ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తుడు
أَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَإِنَاثًا ۖ وَيَجْعَلُ مَنْ يَشَاءُ عَقِيمًا ۚ إِنَّهُ عَلِيمٌ قَدِيرٌ
లేదా! వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు. మరియు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్ధుడు
وَمَا كَانَ لِبَشَرٍ أَنْ يُكَلِّمَهُ اللَّهُ إِلَّا وَحْيًا أَوْ مِنْ وَرَاءِ حِجَابٍ أَوْ يُرْسِلَ رَسُولًا فَيُوحِيَ بِإِذْنِهِ مَا يَشَاءُ ۚ إِنَّهُ عَلِيٌّ حَكِيمٌ
మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా లేదా తెర వెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వహీ) అవతరింప జేయబడటం తప్ప! నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు
وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ رُوحًا مِنْ أَمْرِنَا ۚ مَا كُنْتَ تَدْرِي مَا الْكِتَابُ وَلَا الْإِيمَانُ وَلَٰكِنْ جَعَلْنَاهُ نُورًا نَهْدِي بِهِ مَنْ نَشَاءُ مِنْ عِبَادِنَا ۚ وَإِنَّكَ لَتَهْدِي إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు

Choose other languages: