Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #54 Translated in Telugu

فَانْظُرْ إِلَىٰ آثَارِ رَحْمَتِ اللَّهِ كَيْفَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْيِي الْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَظَلُّوا مِنْ بَعْدِهِ يَكْفُرُونَ
మరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపు పచ్చగా మారి పోవటాన్ని చూసిన తరువాత వారు కృతఘ్నతకు లోనవుతారు (సత్యతిరస్కారులవుతారు)
فَإِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ
నిశ్చయంగా, నీవు (ఓ ముహమ్మద్!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా సందేశాన్ని వినిపించలేవు
وَمَا أَنْتَ بِهَادِ الْعُمْيِ عَنْ ضَلَالَتِهِمْ ۖ إِنْ تُسْمِعُ إِلَّا مَنْ يُؤْمِنُ بِآيَاتِنَا فَهُمْ مُسْلِمُونَ
మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు
اللَّهُ الَّذِي خَلَقَكُمْ مِنْ ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنْ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنْ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ
అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు

Choose other languages: