Quran Apps in many lanuages:

Surah An-Nur Ayahs #37 Translated in Telugu

وَلْيَسْتَعْفِفِ الَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغْنِيَهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ ۗ وَالَّذِينَ يَبْتَغُونَ الْكِتَابَ مِمَّا مَلَكَتْ أَيْمَانُكُمْ فَكَاتِبُوهُمْ إِنْ عَلِمْتُمْ فِيهِمْ خَيْرًا ۖ وَآتُوهُمْ مِنْ مَالِ اللَّهِ الَّذِي آتَاكُمْ ۚ وَلَا تُكْرِهُوا فَتَيَاتِكُمْ عَلَى الْبِغَاءِ إِنْ أَرَدْنَ تَحَصُّنًا لِتَبْتَغُوا عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَمَنْ يُكْرِهْهُنَّ فَإِنَّ اللَّهَ مِنْ بَعْدِ إِكْرَاهِهِنَّ غَفُورٌ رَحِيمٌ
ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్విండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి, ఎవరైనా వారిని బలవంతపెడితే! నిశ్చయంగా, అల్లాహ్ వారిని (ఆ బానిస స్త్రీలకు) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత
وَلَقَدْ أَنْزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُبَيِّنَاتٍ وَمَثَلًا مِنَ الَّذِينَ خَلَوْا مِنْ قَبْلِكُمْ وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ
మరియు వాస్తవానికి, మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను మరియు దైవభీతి గలవారికి బోధనలను (ఉపదేశాలను) అవతరింపజేశాము
اللَّهُ نُورُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ مَثَلُ نُورِهِ كَمِشْكَاةٍ فِيهَا مِصْبَاحٌ ۖ الْمِصْبَاحُ فِي زُجَاجَةٍ ۖ الزُّجَاجَةُ كَأَنَّهَا كَوْكَبٌ دُرِّيٌّ يُوقَدُ مِنْ شَجَرَةٍ مُبَارَكَةٍ زَيْتُونَةٍ لَا شَرْقِيَّةٍ وَلَا غَرْبِيَّةٍ يَكَادُ زَيْتُهَا يُضِيءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ۚ نُورٌ عَلَىٰ نُورٍ ۗ يَهْدِي اللَّهُ لِنُورِهِ مَنْ يَشَاءُ ۚ وَيَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ لِلنَّاسِ ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి. ఆయన జ్యోతిని, గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలే ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షం (నూనె) తో వెలిగించబడుతున్నది, అది (ఆ వృక్షం) తూర్పుకు గానీ, పడమరకు గానీ చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగు మీద వెలుగు! అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు
فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَنْ تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు
رِجَالٌ لَا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَنْ ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ నుండీ, నమాజ్ స్థాపించడం నుండీ మరియు విధిదానం (జకాత్) ఇవ్వడం నుండీ తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగి పోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు

Choose other languages: