Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #90 Translated in Telugu

وَإِذَا حُيِّيتُمْ بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا
మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ حَدِيثًا
అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది
فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّهُ أَرْكَسَهُمْ بِمَا كَسَبُوا ۚ أَتُرِيدُونَ أَنْ تَهْدُوا مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَلَنْ تَجِدَ لَهُ سَبِيلًا
(ఓ విశ్వాసులారా!) మీకేమయింది, కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలిపోయారు. అల్లాహ్ వారి కర్మల ఫలితంగా, వారిని వారి పూర్వ (అవిశ్వాస) స్థితికి మరలించాడు. ఏమీ? అల్లాహ్ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి, అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు (ఋజు) మార్గం చూప లేవు
وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً ۖ فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّهِ ۚ فَإِنْ تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدْتُمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا
మరియు వారు సత్యతిరస్కారులైనట్లే మీరు కూడా సత్యతిరస్కారులై, వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్ మార్గంలో వారు వలస పోనంత వరకు (హిజ్రత్ చేయనంత వరకు), వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెను దిరిగితే, మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా, సహాయకులుగా చేసుకోకండి
إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَنْ يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు

Choose other languages: