Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #53 Translated in Telugu

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنْفُسَهُمْ ۚ بَلِ اللَّهُ يُزَكِّي مَنْ يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి, అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు
انْظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُبِينًا
చూడండి! వారు అల్లాహ్ ను గురించి ఏ విధమైన అబద్ధాన్ని కల్పిస్తున్నారో? మరియు స్పష్టమైన పాపం, అని చెప్పటానికి ఇది చాలు
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلًا
ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్ మరియు తాగూత్ లలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి: విశ్వాసుల కంటే, వీరే సరైన మార్గంలో ఉన్నారు." అని అంటారు
أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ ۖ وَمَنْ يَلْعَنِ اللَّهُ فَلَنْ تَجِدَ لَهُ نَصِيرًا
ఇలాంటి వారే, అల్లాహ్ శాపానికి (బహిష్కారానికి) గురి అయిన వారు. మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు
أَمْ لَهُمْ نَصِيبٌ مِنَ الْمُلْكِ فَإِذًا لَا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا
లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు

Choose other languages: