Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #41 Translated in Telugu

الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُهِينًا
ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచి పెట్టే వారినీ (అల్లాహ్ ప్రేమించడు). మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము
وَالَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَنْ يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ قَرِينًا
మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చుపెడతారో మరియు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో! మరియు ఎవడైతే షైతాన్ ను తన స్నేహితునిగా (ఖరీనున్ గా) చేసుకుంటాడో! అతడు ఎంత నీచమైన స్నేహితుడు
وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنْفَقُوا مِمَّا رَزَقَهُمُ اللَّهُ ۚ وَكَانَ اللَّهُ بِهِمْ عَلِيمًا
మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికే మయ్యేది? మరియు అల్లాహ్ కు, వారిని గురించి బాగా తెలుసు
إِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِنْ تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِنْ لَدُنْهُ أَجْرًا عَظِيمًا
నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు
فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَٰؤُلَاءِ شَهِيدًا
మేము (ప్రతిఫల దినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది

Choose other languages: