Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #169 Translated in Telugu

رُسُلًا مُبَشِّرِينَ وَمُنْذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు
لَٰكِنِ اللَّهُ يَشْهَدُ بِمَا أَنْزَلَ إِلَيْكَ ۖ أَنْزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు
إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا
నిశ్చయంగా, ఎవరైతే సత్య తిరస్కారులై, ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు
إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا
నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు
إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం

Choose other languages: