Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #139 Translated in Telugu

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ عَلَىٰ أَنْفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِنْ يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَنْ تَعْدِلُوا ۚ وَإِنْ تَلْوُوا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు. మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنْزَلَ مِنْ قَبْلُ ۚ وَمَنْ يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే
إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు
بَشِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
కపట విశ్వాసులకు, నిశ్చయంగా! బాధాకరమైన శిక్ష ఉందని తెలుపు
الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِنْدَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا
ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారో! అలాంటి వారు, వారి (అవిశ్వాసుల) నుండి, గౌరవాన్ని పొందగోరు తున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్ కే చెందినది

Choose other languages: