Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #141 Translated in Telugu

إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు
بَشِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
కపట విశ్వాసులకు, నిశ్చయంగా! బాధాకరమైన శిక్ష ఉందని తెలుపు
الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِنْدَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا
ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారో! అలాంటి వారు, వారి (అవిశ్వాసుల) నుండి, గౌరవాన్ని పొందగోరు తున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్ కే చెందినది
وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ ۗ إِنَّ اللَّهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا
మరియు వాస్తవానికి, (అల్లాహ్) మీ కొరకు ఈ గ్రంథంలో (ఈ విధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: ఒకవేళ మీరు అల్లాహ్ సూక్తులను గురించి తిరస్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసేవారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!" అలా చేస్తే నిశ్చయంగా, మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు
الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِنْ كَانَ لَكُمْ فَتْحٌ مِنَ اللَّهِ قَالُوا أَلَمْ نَكُنْ مَعَكُمْ وَإِنْ كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُمْ مِنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَنْ يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا
వారు (కపట విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: ఏమీ? మేము మీతో కలిసి లేమా?" కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?" కాని అల్లాహ్ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్! ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గం చూపడు

Choose other languages: