Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #120 Translated in Telugu

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَنْ يَشَاءُ ۚ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే
إِنْ يَدْعُونَ مِنْ دُونِهِ إِلَّا إِنَاثًا وَإِنْ يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَرِيدًا
ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షైతాన్ నే ప్రార్థిస్తున్నారు
لَعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَفْرُوضًا
అల్లాహ్ అతన్ని శపించాడు (బహిష్కరించాడు). మరియు అతడు (షైతాన్) ఇలా అన్నాడు: నేను నిశ్చయంగా, నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను
وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَنْ يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِنْ دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُبِينًا
మరియు నిశ్చయంగా, నేను వారిని మార్గభ్రష్టులుగా చేస్తాను; మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు. మరియు ఎవడు అల్లాహ్ కు బదులుగా షైతాన్ ను తన రక్షకునిగా చేసుకుంటాడో! వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయిన వాడు
يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే

Choose other languages: