Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #79 Translated in Telugu

ضَرَبَ اللَّهُ مَثَلًا عَبْدًا مَمْلُوكًا لَا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَمَنْ رَزَقْنَاهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنْفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُونَ ۚ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేని వాడు, మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందిన వాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేయగల వాడు. ఏమీ? వీరిద్దరు సమానులవుతారా? సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే! కానీ, చాలా మందికి ఇది తెలియదు
وَضَرَبَ اللَّهُ مَثَلًا رَجُلَيْنِ أَحَدُهُمَا أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَاهُ أَيْنَمَا يُوَجِّهْهُ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِي هُوَ وَمَنْ يَأْمُرُ بِالْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
అల్లాహ్ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైనపని చేయలేడు. ఏమీ? ఇటువంటి వాడు మరొకతనితో - ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ, ఋజుమార్గంపై నడుస్తున్నాడో - సమానుడు కాగలడా
وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అంతిమ ఘడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَاللَّهُ أَخْرَجَكُمْ مِنْ بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ
మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని
أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ
ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య స్థితిలో (పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? వాటిని అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ (ఆకాశంలో) నిలుపలేరు. నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి సూచనలున్నాయి

Choose other languages: