Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #66 Translated in Telugu

وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُمْ مُفْرَطُونَ
మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే)." అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చయంగా, వారందులోకి త్రోయబడి, వదలబడతారు
تَاللَّهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِنْ قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షైతాన్ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేశాడు. అదే విధంగా ఈనాడు కూడా వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
وَمَا أَنْزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِقَوْمٍ يُؤْمِنُونَ
మరియు మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురి అయిన విషయాన్ని వారికి నీవు స్పష్టం చేయటానికీ మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వం గానూ మరియు కారుణ్యం గానూ ఉంచటానికి
وَاللَّهُ أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِقَوْمٍ يَسْمَعُونَ
మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి సూచన ఉంది
وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُسْقِيكُمْ مِمَّا فِي بُطُونِهِ مِنْ بَيْنِ فَرْثٍ وَدَمٍ لَبَنًا خَالِصًا سَائِغًا لِلشَّارِبِينَ
మరియు నిశ్చయంగా, మీకు పశువులలో ఒక గుణపాఠం ది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన (స్వచ్ఛమైన) పాలు, త్రాగేవారికి ఎంతో రుచికరమైనది

Choose other languages: