Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #58 Translated in Telugu

ثُمَّ إِذَا كَشَفَ الضُّرَّ عَنْكُمْ إِذَا فَرِيقٌ مِنْكُمْ بِرَبِّهِمْ يُشْرِكُونَ
తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) కల్పించ సాగుతారు
لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
మేము చేసిన ఉపకారానికి కృతఘ్నతగా - సరే (కొంతకాలం) సుఖాలను అనుభవించండి. తరువాత మీరు తెలుసుకుంటారు
وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَفْتَرُونَ
మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటక దైవాల) కొరకు నియమించుకుంటారు వారు. అల్లాహ్ తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు
وَيَجْعَلُونَ لِلَّهِ الْبَنَاتِ سُبْحَانَهُ ۙ وَلَهُمْ مَا يَشْتَهُونَ
మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేదు. (నియమించుకుంటారు)
وَإِذَا بُشِّرَ أَحَدُهُمْ بِالْأُنْثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ
మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడి పోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు

Choose other languages: