Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #60 Translated in Telugu

وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَفْتَرُونَ
మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటక దైవాల) కొరకు నియమించుకుంటారు వారు. అల్లాహ్ తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు
وَيَجْعَلُونَ لِلَّهِ الْبَنَاتِ سُبْحَانَهُ ۙ وَلَهُمْ مَا يَشْتَهُونَ
మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేదు. (నియమించుకుంటారు)
وَإِذَا بُشِّرَ أَحَدُهُمْ بِالْأُنْثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ
మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడి పోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు
يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِنْ سُوءِ مَا بُشِّرَ بِهِ ۚ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ ۗ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ
తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చి వేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో
لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ مَثَلُ السَّوْءِ ۖ وَلِلَّهِ الْمَثَلُ الْأَعْلَىٰ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు

Choose other languages: