Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #32 Translated in Telugu

الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنْفُسِهِمْ ۖ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِنْ سُوءٍ ۚ بَلَىٰ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
వారిపై, ఎవరైతే, తమను తాము దుర్మార్గంలో ముంచుకొని ఉన్నప్పుడు, దేవదూతలు వారి ప్రాణాలు తీస్తారో!" అప్పుడు వారు (సత్యతిరస్కారులు) లొంగి పోయి: మేము ఎలాంటి పాపం చేయలేదు." అని అంటారు. (దేవదూతలు వారితో ఇలా అంటారు): అలా కాదు! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
فَادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
కావున నరక ద్వారాలలో ప్రవేశించండి. అక్కడ శాశ్వతంగా ఉండటానికి! గర్విష్ఠులకు లభించే నివాసం ఎంత చెడ్డది
وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنْزَلَ رَبُّكُمْ ۚ قَالُوا خَيْرًا ۗ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ
మరియు దైవభీతి గలవారితో: మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని అడిగినప్పుడు, వారు: అత్యుత్తమమైనది." అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీని కంటే ఉత్తమమైంది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది
جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّهُ الْمُتَّقِينَ
వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు
الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు

Choose other languages: