Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #111 Translated in Telugu

ذَٰلِكَ بِأَنَّهُمُ اسْتَحَبُّوا الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَأَنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు
أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ
ఇలాంటి వారి హృదయాల మీదా. చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్ ముద్రవేసి ఉన్నాడు. మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు
لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْخَاسِرُونَ
నిశ్చయంగా, పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే, అని అనటంలో ఎలాంటి సందేహం లేదు
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا مِنْ بَعْدِ مَا فُتِنُوا ثُمَّ جَاهَدُوا وَصَبَرُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُورٌ رَحِيمٌ
ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో! దాని తరువాత నిశ్చయంగా, అలాంటి వారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
يَوْمَ تَأْتِي كُلُّ نَفْسٍ تُجَادِلُ عَنْ نَفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో! ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు

Choose other languages: