Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #76 Translated in Telugu

لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ
నిశ్చయంగా, మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని పలికే వారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీహ్ (క్రీస్తు) ఇలా అన్నాడు: ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్ నే ఆరాధించండి. వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు
لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِنْ لَمْ يَنْتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
నిశ్చయంగా, అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు!" అని అనేవారు వాస్తవానికి సత్యతిరస్కారులో. మరియు ఒకే ఒక్క ఆరాధ్యదేవుడు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటనలు మానుకోకపోతే, వారిలో సత్యతిరస్కారులైన వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది
أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
مَا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انْظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انْظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)
قُلْ أَتَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఇలా అను: ఏమీ? మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గానీ, లాభం గానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

Choose other languages: