Quran Apps in many lanuages:

Surah Al-Jumua Ayahs #6 Translated in Telugu

هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ
ఆయనే ఆ నిరక్ష్యరాస్యులైన వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్ లను) చదివి వినిపిస్తున్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు
وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ అనుగ్రహశాలి, సర్వోత్తముడు
مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిద వలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్ సూచన (ఆయాత్) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంత చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు
قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِنْ زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِنْ دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ
వారితో ఇలా అను: ఓ యూదులారా! నిశ్చయంగా, ఇతర ప్రజల కంటే మీరు మాత్రమే అల్లాహ్ కు ప్రియమైన వారు (స్నేహితులు) అనే భావం మీకుంటే, మీ (వాదంలో) మీరు సత్యవంతులే అయితే మీరు చావును కోరండి

Choose other languages: