Quran Apps in many lanuages:

Surah Al-Jathiya Ayahs #30 Translated in Telugu

قُلِ اللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
వారిలో ఇలా అను: అల్లాహ్ యే మీకు జీవితమిచ్చేవాడు తరువాత మరణింప జేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశ పరిచేవాడూను! ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు
وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ الْمُبْطِلُونَ
మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైననాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు
وَتَرَىٰ كُلَّ أُمَّةٍ جَاثِيَةً ۚ كُلُّ أُمَّةٍ تُدْعَىٰ إِلَىٰ كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُونَ
మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది
هَٰذَا كِتَابُنَا يَنْطِقُ عَلَيْكُمْ بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنْسِخُ مَا كُنْتُمْ تَعْمَلُونَ
ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము
فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِي رَحْمَتِهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِينُ
కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు. ఇదే ఆ స్పష్టమైన విజయం

Choose other languages: