Quran Apps in many lanuages:

Surah Al-Jathiya Ayahs #33 Translated in Telugu

هَٰذَا كِتَابُنَا يَنْطِقُ عَلَيْكُمْ بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنْسِخُ مَا كُنْتُمْ تَعْمَلُونَ
ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము
فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِي رَحْمَتِهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِينُ
కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు. ఇదే ఆ స్పష్టమైన విజయం
وَأَمَّا الَّذِينَ كَفَرُوا أَفَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنْتُمْ قَوْمًا مُجْرِمِينَ
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో (ఇలా అనబడుతుంది): మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడి పోయారు మరియు అపరాధులై పోయారు
وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَالسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُمْ مَا نَدْرِي مَا السَّاعَةُ إِنْ نَظُنُّ إِلَّا ظَنًّا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ
మరియు: నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము
وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు, ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది

Choose other languages: