Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #46 Translated in Telugu

قُلْ لَوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا
వారితో అను: ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా
سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا
ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు)
تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالْأَرْضُ وَمَنْ فِيهِنَّ ۚ وَإِنْ مِنْ شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِنْ لَا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు
وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا
మరియు నీవు ఖుర్ఆన్ ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య కనబడని తెర వేసి ఉన్నాము
وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا
మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. ఒకవేళ నీవు ఖుర్ఆన్ (పారాయణం) తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు

Choose other languages: