Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #43 Translated in Telugu

ذَٰلِكَ مِمَّا أَوْحَىٰ إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتُلْقَىٰ فِي جَهَنَّمَ مَلُومًا مَدْحُورًا
ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు
أَفَأَصْفَاكُمْ رَبُّكُمْ بِالْبَنِينَ وَاتَّخَذَ مِنَ الْمَلَائِكَةِ إِنَاثًا ۚ إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا
ఏమీ? మీ ప్రభువు, మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు పలికేది చాలా ఘోరమైన మాట
وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا
మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము. కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది
قُلْ لَوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا
వారితో అను: ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా
سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا
ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు)

Choose other languages: