Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #34 Translated in Telugu

إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా, ఆయనే తన దాసుల (స్థితుల)ను బాగా ఎరిగేవాడూ, చూసేవాడూను
وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا
మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్ప నేరం
وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము
وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۗ وَمَنْ قُتِلَ مَظْلُومًا فَقَدْ جَعَلْنَا لِوَلِيِّهِ سُلْطَانًا فَلَا يُسْرِفْ فِي الْقَتْلِ ۖ إِنَّهُ كَانَ مَنْصُورًا
న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము. కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది
وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۚ وَأَوْفُوا بِالْعَهْدِ ۖ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا
మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి, నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది

Choose other languages: