Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #14 Translated in Telugu

وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
మరియు నిశ్చయంగా, పరలోకాన్ని విశ్వసించిన వారికి మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచామని (తెలియజేస్తుంది)
وَيَدْعُ الْإِنْسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ۖ وَكَانَ الْإِنْسَانُ عَجُولًا
మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడు కొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు (ఆత్రగాడు)
وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَتَيْنِ ۖ فَمَحَوْنَا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ النَّهَارِ مُبْصِرَةً لِتَبْتَغُوا فَضْلًا مِنْ رَبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا
మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము. మరియు పగటి సూచనను - మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు (కాలాన్ని) గణించటానికి - ప్రకాశవంతమైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము
وَكُلَّ إِنْسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ ۖ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنْشُورًا
మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు
اقْرَأْ كِتَابَكَ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا
(అతనితో ఇలా అనబడుతుంది): నీవు నీ కర్మపత్రాన్ని చదువుకో! ఈ రోజు నీ (కర్మల) లెక్క చూసుకోవటానికి స్వయంగా నీవే చాలు

Choose other languages: