Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #10 Translated in Telugu

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَنْ فِي الْقُبُورِ
మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది. అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు
وَمِنَ النَّاسِ مَنْ يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُنِيرٍ
అయినా మానవులలో - జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే - అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు ఉన్నాడు
ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَنْ سَبِيلِ اللَّهِ ۖ لَهُ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَنُذِيقُهُ يَوْمَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيقِ
(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు. వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్ని శిక్షను రుచి చూపుతాము
ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ
(అతనితో): ఇది నీవు నీ చేతులారా చేసి పంపిన దాని (ఫలితం) మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు!" (అని అనబడుతుంది)

Choose other languages: