Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #54 Translated in Telugu

فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ مَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
కావున ఎవరైతే, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి
وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
కాని ఎవరైతే మా సూచనలను కించపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్నివాసులవుతారు
وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ وَلَا نَبِيٍّ إِلَّا إِذَا تَمَنَّىٰ أَلْقَى الشَّيْطَانُ فِي أُمْنِيَّتِهِ فَيَنْسَخُ اللَّهُ مَا يُلْقِي الشَّيْطَانُ ثُمَّ يُحْكِمُ اللَّهُ آيَاتِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త గానీ (నా సందేశాన్ని ప్రజలకు) అందించగోరినపుడు, షైతాన్ అతని కోరికలను ఆటంక పరచకుండా ఉండలేదు. కాని షైతాన్ కల్పించిన ఆటంకాలను అల్లాహ్ నిర్మూలించాడు. ఆ తరువాత అల్లాహ్ తన ఆయత్ లను స్థిరపరచాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
لِيَجْعَلَ مَا يُلْقِي الشَّيْطَانُ فِتْنَةً لِلَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَالْقَاسِيَةِ قُلُوبُهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَفِي شِقَاقٍ بَعِيدٍ
ఎవరి హృదయాలలో రోగముందో! మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షైతాన్ కల్పించేవి (సందేహాలు) ఒక పరీక్షగా చేయబడటానికి. మరియు నిశ్చయంగా ఈ దుర్మార్గులు విరోధంలో చాలా దూరం వెళ్ళిపోయారు
وَلِيَعْلَمَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ ۗ وَإِنَّ اللَّهَ لَهَادِ الَّذِينَ آمَنُوا إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
మరియు జ్ఞానమొసంగ బడినవారు ఇది (ఈ ఖుర్ఆన్) నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని తెలుసుకొని దానిని విశ్వసించటానికి, వారి హృదయాలు దానికి అంకితం అవటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించే వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శత్వం చేస్తాడు

Choose other languages: