Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #30 Translated in Telugu

وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ أَنْ لَا تُشْرِكْ بِي شَيْئًا وَطَهِّرْ بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْقَائِمِينَ وَالرُّكَّعِ السُّجُودِ
మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు" అని అన్నాము
وَأَذِّنْ فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجَالًا وَعَلَىٰ كُلِّ ضَامِرٍ يَأْتِينَ مِنْ كُلِّ فَجٍّ عَمِيقٍ
మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు: వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు
لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ عَلَىٰ مَا رَزَقَهُمْ مِنْ بَهِيمَةِ الْأَنْعَامِ ۖ فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ
వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి
ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَلْيُوفُوا نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ
తరువాత వారు హజ్జ్ ఆచారాలు (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి
ذَٰلِكَ وَمَنْ يُعَظِّمْ حُرُمَاتِ اللَّهِ فَهُوَ خَيْرٌ لَهُ عِنْدَ رَبِّهِ ۗ وَأُحِلَّتْ لَكُمُ الْأَنْعَامُ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ ۖ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثَانِ وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ
ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిద్ధమని) చెప్ప బడినవి తప్ప, ఇతర పశువులన్నీ ధర్మ సమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్ధపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి

Choose other languages: